ముగించు

సాంఘిక సంక్షేమ శాఖ

డిపార్టుమెంటు యొక్క పాత్ర మరియు పనితీరు:

సాంఘిక సంక్షేమ శాఖ షెడ్యూల్డ్ కులాల సమగ్ర మరియు షెడ్యూల్డ్ కుల భాగం అమలుకు అంకితం చేయబడింది.

సాంఘిక సంక్షేమ శాఖ యొక్క ప్రధాన లక్ష్యాలు విద్యా పురోగతి, సామజిక – ఆర్థిక అభివృద్ధి, షెడ్యూల్డ్ కులాల సంక్షేమం మరియు రక్షణ మరియు అనాధ పిల్లల కోసం గృహాలు, జోగిన్ల పునరావాసం, బంధిత కార్మికులు మరియు స్కావెంజేర్స్ వంటి సామజిక భద్రత కార్యక్రమాలను అమలు చేయడం. ఈ విభాగం వేర్వేరు విభాగాల ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను సాదిస్తుంది

వై.యస్.ఆర్.జిల్లా లో పా శాల విద్యార్థుల కొరకు 81  వసతి గృహములు కలవు.  ఇందు లో బాలురకు  53  బాలికలకు 28  కలవు మరియు 19 కాలేజి విద్యార్థుల వసతి గృహములు కలవు, అంబేద్కర్ స్టడీ సర్కిల్, తిరుపతి, చిత్తూర్ జిల్లా ., ద్వారా యస్.సి విద్యార్థులకు యుపి.యస్.సి, ఎపిపియస్సీ, యస్.యస్.సి, ఆర్.ఆర్.బి, బ్యాంక్స్, డి.యస్.సి, మొదలైన పోటి పరిక్షలకు హాజరు కావడానికి పొందుటకు కోచింగ్ ఇస్తోంది.

 

జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారము, వై.యస్.ఆర్.జిల్లా జనాభా 28,84,524 మంది అందులో యస్.సి జనాభా 4,65,794 (16.14%)

లింగం 2001 2011
పురుషులు 2,07,302 2,32,123
మహిళలు 2,02,190 2,33,671
మొత్తం 4,09,492 4,65,794

వ.సంఖ్య సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అమలు చేయబడుచున్న పథకములు
1 ప్రభుత్వ ప్రీ-మెట్రిక్  వసతి గృహములు మరియు ఇతర  సంస్థలు ప్రభుత్వ ప్రీ-మెట్రిక్ వసతి గృహములు కోసం జిల్లా లో 81 హాస్టల్స్ / సంస్థలు పనిచేస్తున్నావి.

వైట్ రేషన్ కార్డు కలిగి పేద షెడ్యూల్డ్ కుల విద్యార్థులకు ఆహారం, సౌందర్య సాధనాలు, వసతి,  నోట్ బుక్స్ , పరుపు  పదార్థములు, యునిఫారం, నైట్ వేర్, స్లిప్పర్స్ , స్పోర్ట్స్ మెటీరియల్స్  వంటి అన్ని సౌకర్యాలను ఉచితంగా అందించే హాస్టల్స్ లో ప్రవేశం ఇవ్వబడుతుంది.

2019-20 విద్యా సంవత్సరము గాను ,  8953 విద్యార్థులకు వసతి కల్పించడమైనది.

2 ప్రభుత్వ కాలేజీ వసతి గృహములు మరియు ఇతర  సంస్థలు ప్రభుత్వ ప్రీ-మెట్రిక్ వసతి గృహములు కోసం జిల్లా లో 19 హాస్టల్స్ / సంస్థలు పనిచేస్తున్నావి.

వైట్ రేషన్ కార్డు కలిగి పేద షెడ్యూల్డ్ కుల విద్యార్థులకు ఆహారం, సౌందర్య సాధనాలు, వసతి,  నోట్ బుక్స్ , పరుపు  పదార్థములు, యునిఫారం, నైట్ వేర్, స్లిప్పర్స్ , స్పోర్ట్స్ మెటీరియల్స్  వంటి అన్ని సౌకర్యాలను ఉచితంగా అందించే హాస్టల్స్ లో ప్రవేశం ఇవ్వబడుతుంది.

2019-20 విద్యా సంవత్సరము గాను ,  2407 విద్యార్థులకు వసతి కల్పించడమైనది.

3 పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ వైట్ రేషన్ కార్డు లేదా తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ.2.00 లక్షలు ఉన్న యస్.సి విద్యార్థులందరూ ఇంటర్మీడియట్ మరియు అంతకంటే ఎక్కువ కోర్సుల చదివే విద్యార్థులకు స్కాలర్ షిప్స్ లనకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అర్హతగల యస్.సి విద్యార్థులకు మెస్ చార్జీలు మరియు  ట్యుషన్ ఫీజు రీయిబర్స్మెంట్ మంజూరు చేయబడును.
4 ప్రీ-మెట్రిక్ స్కాలర్ షిప్స్ వైట్ రేషన్ కార్డు లేదా తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ.2.00 లక్షలు ఉన్న యస్.సి విద్యార్థులందరూ జిల్లా ప్రభుత్వ , మునిసిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ మరియు ఎయిడెడ్ స్కూల్స్ లో 5వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు స్కాలర్షిప్ లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
5 ప్రతిభావంతులైన విద్యార్థుల యస్.సి విద్యార్థులందరూ వైట్ రేషన్ కార్డ్ లేదా తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ.70,000 క్రింద ఉన్న విద్యార్థులు ఎంపిక చేయబడిన పా‌‍ఠశాలల్లో ప్రవేశానికి అర్హులు

1వ తరగతి(నాన్-రెసిడెన్షియల్): 1వ తరగతి (నాన్ – రెసిడెన్షియల్) ప్రవేశమునకు దరఖాస్తు చేసుకున్న యస్.సి విద్యార్థిని / విద్యార్థులు 200 అడ్మిషన్లు కేటాయించబడినవి, ఎలెక్ట్రానిక్ లాటరి పద్ధతి అడ్మిషన్లు జరుగును.

5వ తరగతి(రెసిడెన్షియల్):  5వ తరగతి ( రెసిడెన్షియల్) ప్రవేశమునకు దరఖాస్తు చేసుకున్న యస్.సి విద్యార్థిని / విద్యార్థులు 250 అడ్మిషన్లు మేరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు 4వ తరగతి సిలబస్ నుంచి ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.

6  హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యస్.సి విద్యార్థులకు వైట్ రేషన్ కార్డు లేదా తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ.70,000 క్రింద ఉన్న విద్యార్థులు ఎంపిక చేయబడిన పా‌‍ఠశాలల్లోప్రవేశానికి అర్హులు. 1వ తరగతి (నాన్ – రెసిడెన్షియల్) ప్రవేశమునకు దరఖాస్తు చేసుకున్న యస్.సి విద్యార్థిని / విద్యార్థులు 5 అడ్మిషన్లు కేటాయించబడినవి,  లాటరి పద్ధతి అడ్మిషన్లు జరుగును.
7  అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్యానిధి ఈ పథకం ద్వారా ప్రభుత్వం అనుమతించిన విదేశాలలో ఉన్నత విద్యాను అభ్యసించుటకు విద్యార్థులకు రూ.15,00,000/- మంజూరు చేయబడుతుంది. తల్లి / తండ్రుల వార్షిక ఆదాయము రూ.6.00 లక్షలు మించరాదు.
8 వై.యస్.ఆర్ విద్యోన్నతి ఈ పథకం ద్వారా పేద యస్.సి విద్యార్థులు సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత స్థాయి పోటి పరిక్షలకు సమీకృత ఉచిత శిక్షణ కల్పించబడును తల్లి / తండ్రుల వార్షిక  ఆదాయము రూ.6.00 లక్షలు మించరాదు.  అర్హత కలిగిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నోటిఫికేషన్ వెలువడించినప్పుడు సంబందించిన వెబ్ సైట్ నందు శిక్షణ ఉచితముగా పొందుటకు దరఖాస్తు చేసుకొనవలెను.  మెరిట్ ఆధారంగా విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఎంపిక కాబడిన యస్.సి విద్యార్థులకు రాష్ట్రం లో గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలలో సివిలి సర్వీసెస్ పోటి పరిక్షల కొరకు ఉచితముగా కల్పించబడును.
9  కార్పొరేట్ కళాశాల ఈ పథకం ద్వారా పేద యస్.సి /యస్.టి/ బి.సి / ఈ.బి.సి/మైనారిటీ & వికలాంగుల విద్యార్థులు పదవ తరగతి   7 జి.పి.ఏ పాయింట్స్ ఆ పై పొందిన విద్యార్థులు గుర్తింపు పొందిన కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఎంసెట్ / ఇఇట్ / ఏఐఇఇఇ మొదలగు కోచింగ్ సదుపాయము కల్పించబడును. దీని కొరకు  7 జి.పి.ఏ పాయింట్స్ ఆ పై పొందిన యస్.సి /యస్.టి/ బి.సి / ఈ.బి.సి/మైనారిటీ & వికలాంగుల విద్యార్థులు వెబ్సైటు నందు దరఖాస్తు చేసుకొనవలెను.

వైట్ రేషన్ కార్డు లేదా తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ.2.00 లక్షలు మించరాదు.

2019-20 విద్యా సంవత్సరము గాను వై.యస్.ఆర్.జిల్లా నుండి 130 మంది  విద్యార్థులకు రాష్ట్రం లోని గుర్తింపు  పొందిన వివిధ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించుటకు ఎంపిక చేయడమైనది.

10  విద్యానిధి వృతి లో శిక్షణ ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం యస్.సి విద్యార్థులకు న్యాయపరిపాలన యందు  3 సంవత్సరములు పాటు శిక్షణ ఇవ్వబడును.  శిక్షణ  కాలమందు నెలకు రూ.1000/- స్టైఫండ్ ఇవ్వబడును.   వీరికి పుస్తకములు, ఫర్నిచర్ కొరకు రూ.6000/- మరియు రూ.585/- ఎన్రోల్మెంట్ ఫీజు క్రింద మంజూరు చేయబడును.

ప్రతి  సంవత్సరానికి 8 విద్యార్థులను  ఎంపిక చేయడం జరుగుతుంది.

11  జగ్జీవన్ జ్యోతి ఉచిత విద్యుత్ ఈ పథకం ద్వారా 100 యునిట్లు  వరకు వినియోగించే షెడ్యూల్డ్ కులముల కుటుంబాలకు ప్రభుత్వమే విద్యుత్ చార్జీలు చెల్లించబడును 01-08-2019 నుండి జగ్జీవన్ జ్యోతి పథకం ద్వారా మొదటగా ఉన్న నెలకు 100 యునిట్లు  ఉచిత విద్యుత్ పరిమితి నెలకు 200 యునిట్లు  లోబడి పెంచబడింది తద్వారా ఎక్కువ కుటుంబాలకు లబ్ది చేకురేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్ణయించడమైనది.   ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 60,000 వేల షెడ్యూల్డ్ కులముల కుటుంబాలకు లబ్ది పొందుచున్నారు.
12  నైపుణ్య నవీకరణ ఈ పథకం ద్వారా యస్.సి విద్యార్థులకు టోఫెల్ / ఐఇఎల్టియస్/జిఆర్ఇ మరియు జిమాట్ మరియు ఇతర విశ్వవిద్యాలయాలలో కోచింగ్ కోసం ఆర్థిక సహాయం అందించడం జరుగుతున్నది.

ఈ పథకానికి  గ్రాడ్యుయేట్లు లేదా గ్రాడ్యుయేషన్  స్థాయిలో చివరి సంవత్సరం విద్యార్థులు మరియు వారి తల్లి / తండ్రుల వార్షిక  ఆదాయము రూ.2.00 లక్షలు క్రింద ఉన్న విద్యార్థులు అర్హులు .

13  బుక్ బ్యాంక్ పథకం యొక్క ఇంటిగ్రేటెడ్ ఈ పథకం ద్వారా ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న యస్.సి విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను సరఫరా చేయడానికి బుక్ బ్యాంక్ ల ఇంటిగ్రేటెడ్ స్కీం అందించబడుతుంది.

మెడికల్, డెంటల్, ఆయుర్వేదిక్, హామియోపతి, వెటర్నరీ సైన్సు వ్యవసాయం ఫార్మసీ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ బి.ఎడ్, యం.బి.ఏ లలిత కళలు

సమాచారం హక్కు చట్టం – 2005

1 ఉపసంచాలకులు అప్పిలేట్ అధికారి , సెల్ నెం:9849903633
2 జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్,  సెల్ నెం:9985430562
3 పర్యవేక్షకులు సహాయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సెల్ నెం:9985430562

 

వ.సంఖ్య హోదా అధికార పరిధి ఫోన్ నెంబర్
1 ఉపసంచాలకులు సాంఘిక శాఖ శాఖ, వై.యస్.ఆర్ కడప జిల్లా 9849903633
2 జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సాంఘిక సంక్షేమ శాఖ, వై.యస్.ఆర్ కడప జిల్లా 9985430562
3 అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ సాంఘిక సంక్షేమ శాఖ, వై.యస్.ఆర్ కడప జిల్లా  8498939674
4 సహాయ సంక్షేమ శాఖ అధికారి సహాయ సంక్షేమ శాఖ కార్యాలయం, కడప 9849909483
5 సహాయ సంక్షేమ శాఖ అధికారి సహాయ సంక్షేమ శాఖ కార్యాలయం, కమలాపురం 9849909482
6 సహాయ సంక్షేమ శాఖ అధికారి సహాయ సంక్షేమ శాఖ కార్యాలయం, కోడూర్ 9866316467
7 సహాయ సంక్షేమ శాఖ అధికారి సహాయ సంక్షేమ శాఖ కార్యాలయం, రాజంపేట 9849903636
8 సహాయ సంక్షేమ శాఖ అధికారి సహాయ సంక్షేమ శాఖ కార్యాలయం, ప్రొద్దటూర్ 9849903746
9 సహాయ సంక్షేమ శాఖ అధికారి సహాయ సంక్షేమ శాఖ కార్యాలయం, రాయచోటి 9849903634
10 సహాయ సంక్షేమ శాఖ అధికారి సహాయ సంక్షేమ శాఖ కార్యాలయం, జమ్మలమడుగు 9849909484
11 సహాయ సంక్షేమ శాఖ అధికారి సహాయ సంక్షేమ శాఖ కార్యాలయం, బద్వేల్ 8106774218
12 సహాయ సంక్షేమ శాఖ అధికారి సహాయ సంక్షేమ శాఖ కార్యాలయం, పులివెందుల 9390029350
13 సహాయ సంక్షేమ శాఖ అధికారి సహాయ సంక్షేమ శాఖ కార్యాలయం, లక్కిరెడ్డిపల్లి 9966914775

 

ముఖ్యమైన వెబ్ సైట్లు

వ.సంఖ్య పథకం వెబ్ సైట్
1 సాంఘిక సంక్షేమ శాఖ https://socialwelfare.apcfss.in
2 పోస్ట్ మెట్రిక్ ఉపకరవేతనములు, ప్రీ-మెట్రిక్ ఉపకరవేతనములు

మరియు ప్రతిభావంతులైన విద్యార్థుల పథకాలు

https://jnanabhumi.ap.gov.in/
3 ప్రభుత్వ వసతి గృహములు https://jnanabhumi.ap.gov.in/nivas
4 అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి విదేశీ విద్యా https://epass.apcfss.in
5 డప్పు కళాకారులు మరియు చర్మకారులు https://scsp.apcfss.in

 

ఆఫీస్ అడ్రస్

సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల వారి కార్యాలయం

డి.బ్లాక్-జి-7, గ్రౌండ్ ఫ్లోర్, క్రొత్త కల్లెక్టరేట్, వై.యస్.ఆర్ కడప జిల్లా

ఆఫీస్ టెలిఫోన్ నెం: 08562-244473

ఆఫీస్ ఇమెయిల్ : dydir_sw_kdp@ap.gov.in

** ** **