మత్స్య శాఖ
పరిచయం:-
కడప జిల్లాలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖలలో మత్య్స శాఖ ఒకటి. కడప జిల్లా నందు నలుగు మత్స్య క్షేత్రములు కలవు.
మత్య్స శాఖ సిబ్బంది
మత్య్స శాఖ యొక్క విధులు:-
- చేప పిల్లలను పెంచి వాటిని మత్స్య కారులకు ఇచ్చుట.
- జిల్లాలోని 239 చెరువులను మరియు 06 రిజర్వాయర్లను మత్స్యాసహకార సంఘాలకు గుత్తకు ఇచ్చుట.
- మత్స్య సహకార సంఘాల ఏర్పాటు మరియు కొత్త సభ్యుల నమోదు.
- సోమశిల, బ్రహ్మ సాగర్, అన్నమయ్య, వెలిగల్లు జలాశయాలలో అర్హులైన మత్స్య కారులకు లైసెన్సులు ఇచ్చుట.
- పేద మత్స్య కారుల అభివృద్ధి కి మరియు సంక్షేమానికి ప్రభుత్వము ప్రవేశ పెట్టిన అన్ని అభివృద్ధి పథకాలను అమలు పరచుట.
- మంచినీటి చేపల చెరువులను క్రమబద్దీకరించుట.
- గ్రామ పంచాయతీ చెరువులను సంభందిత గ్రామ పంచాయతీ వారి ద్వారా వేలం వేయించుట.
మత్స్య క్షేత్రములు:-
కడప జిల్లాలో నాలుగు (04) మత్స్య క్షేత్రములు కలవు.
- మత్య్స క్షేత్రము, కడప
- మత్య్స క్షేత్రము, బి.మఠం
- మత్య్స క్షేత్రము, రాజంపేట
- మత్య్స క్షేత్రము, మైలవరం (నిర్మాణంలో ఉన్నది)
పైన తెలిపిన మత్స్య క్షేత్రములలో పెంచిన చేప పిల్లలను మత్స్య సహకార సంఘాలకు ఉచితముగా సరఫరా చేయడము జరుగును.
చెరువులు మరియు జలశయములు :-
వర్షపు ఆధారిత చెరువులు/ జలాశయాలు, నదులు చేపల పెంపకానికి ముఖ్య నీటివనరులు
వరుస సంఖ్య | నీటి వనరులు | సంఖ్య | పూర్తి నీటి విస్తీర్ణం (హెక్టార్లలో) | ఉపయోగకరనీటి విస్తీర్ణం (హెక్టార్లలో) |
1. | జలశాయలు | 6 | 22193 | 16003 |
2. | మైనర్ ఇరిగేషన్ చెరువులు | 239 | 17392 | 4700 |
3. | గ్రామ పంచాయితీ చెరువులు | 1542 | 15886 | 3971 |
మొత్తం | 1787 | 55471 | 24674 |
చేప పిల్లల విడుదల :-
- మిషన్ ఫింగెర్లింగ్ పథకం ద్వారా 2018-19 సంవత్సరమునకు గాను చెరువులలో మరియు జలాశయాలలో చేపల ఉత్పత్తిని పెంచడానికి మంచి నాణ్యమైన చేపపిల్లలను ప్రభుత్వ మత్స్యక్షేత్రలలో ఉత్పత్తి చేయడము ద్వారా మరియు ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేట్ మత్స్య క్షేత్రాల ద్వారా తీసుకోని వచ్చి నీరు వచ్చిన చెరువులలో మరియు జలాశయాలలో ఉచితముగా విడుదల చేయడము జరిగినది.
- మిషన్ ఫింగెర్లింగ్ పథకం ద్వారా 2018-19 సంవత్సరమునకు గాను 08 జలాశయాలు మరియు 06 చెరువులలో 92.48 లక్షల చేప పిల్లలు విడుదల చేయడము జరిగినది.
జలశాయాలలో చేపలు పట్టు లైసెన్స్ వివరములు:-
ఈ క్రింద తెలుపబడిన జలాశయాలలో చేపలు పట్టు లైసెన్స్ మంజూరు చేయబడినవి
- సోమశిల వెనుక జలాలు నందు 335 చేపలు పట్టు లైసెన్స్ లు మంజూరు చేయబడినవి మరియు ప్రభుత్వానికి రూ. 1,19,350/- రూపాయలు ఆదాయము వచ్చినది.
- వెలిగల్లు జలాశయము నందు 113 చేపలు పట్టు లైసెన్స్ లు మంజూరు చేయబడినవి మరియు ప్రభుత్వానికి రూ. 68,930/- రూపాయలు ఆదాయము వచ్చినది.
- బ్రహ్మ సాగర్ జలాశయము నందు 80 చేపలు పట్టు లైసెన్స్ లు మంజూరు చేయబడినవి మరియు ప్రభుత్వానికి రూ. 47,600/- రూపాయలు ఆదాయము వచ్చినది.
- అన్నమయ్య జలాశయము నందు 21 చేపలు పట్టు లైసెన్స్ లు మంజూరు చేయబడినవి మరియు ప్రభుత్వానికి రూ. 8,610/- రూపాయలు ఆదాయము వచ్చినది.
మంచినీటి ఆక్వాకల్చర్:-
కడప జిల్లా చాపాడు మండలము నందు 10.00 హెక్టార్లలో మంచి నీటి ఆక్వా కల్చర్ క్రమబద్దీకరణ జరుగుచున్నది.
మత్య్స సహకార సంఘాలు:-
కడప జిల్లా నందు 36 జిల్లా ప్రాధమిక మత్స్య సహకార సంఘాలు ఉన్నవి. అందులో 1877 మంది సభ్యులు, 04 మహిళా మత్స్య సహకార సంఘాలు అందులో 128 మంది సభ్యులు మరియు 01 జిల్లా మత్స్య సహకార సంఘo కడప ఉన్నది. అందులో 36 ప్రాధమిక మత్స్య సహకార సంఘాల సభ్యులు రిజిస్టర్ చేయబడివున్నారు .
సంక్షేమ పథకాలు:-
- 2018-19 సంవత్సరమునకు గాను మత్స్యకారులకు సంక్షేమ పథకాల క్రింద వలలు, బొట్లు, 2,3,4 చక్రాల వాహనాలు, శీతలీకరణ పెట్టెలు మరియు ఎలక్ట్రానిక్ తూకములు మంజూరు చేయబడినవి. వాటి యొక్క సబ్సిడీ వివరములు
- 41 మంది SC మత్స్యకారులకు 90% సబ్సిడీ ద్వారా రూ. 29,92,433/- లక్షల విలువైన పై సంక్షేమ పథకాలు అమలు చేయడము జరిగినది.
- 41 మంది ST మత్స్యకారులకు 90% సబ్సిడీ ద్వారా రూ. 14,93,069/- లక్షల విలువైన పై సంక్షేమ పథకాలు అమలు చేయడము జరిగినది.
- 171 మంది SC మత్స్యకారులకు 75% సబ్సిడీ ద్వారా రూ.1,09,21,488/- లక్షల విలువైన పై సంక్షేమ పథకాలు అమలు చేయడము జరిగినది.
మత్స్యకార పెన్షన్:-
- 2018-19 నందు 50 సంవత్సరములు నిండిన మత్స్యకారులకు పెన్షన్ మంజూరు చేయడము జరుగుతున్నది.
- ఇప్పటి వరకు 494 పెన్షన్స్ ను 50 సంవత్సరములు నిండిన మత్స్యకారులకు ఇవ్వడం జరిగినది.
ఎక్కువ సమాచారం కొరకు మత్స్య శాఖ వెబ్సైటు నందు పొందగలరు http://www.fisheries.ap.gov.in