ఎ.పి.ఐ.ఐ.సి.
ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ, కడప
ప్రొఫైల్:
- 1974 వ సంవత్సరములో ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ స్థాపించడమైనది.
- APIIC ఉద్దేశము ఏమనగా పరిశ్రమ ఏరియాలలో ఔత్త్సహిక పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమల ఎస్టేట్ లలోను / పారిశ్రామిక అభివృద్ధి ఏరియాలలోను పరిశ్రమలు స్థాపించుటకు మౌలిక సదుపాయాలు కల్పించబడును.
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము లోకల్ అథారిటీ భాద్యతలు కార్పొరేషన్ కు అప్పగిస్తూ కనీస వసతులైన రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీ, నీటి సరఫరా మొదలగునవి నిర్దేశిత ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (IALA) సర్వీస్ సొసైటీ ద్వారా APIIC వారి నేతృత్వములో చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, బిల్డింగ్ ప్లాను ఆమోదములు మొదలగునవి చేస్తూ తదుపరి ఎస్టేట్ నిర్వహించ బడును.
లక్ష్యాలు:
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారి ఉత్తర్వుల ప్రకారము APIIC వారి క్రొత్త పరిశ్రమల పార్కులలోను ప్లాట్స్ అలాట్మెంట్ లో నిష్పత్తి ప్రకారముగా షెడ్యూల్డ్ కులము / తెగ వారికి కేటాయించుటకు చర్యలు తీసొకొనబడును.
- వెనుక బడిన తరగతుల వారు పరిశ్రమల నిర్మించుకొనుటకు భూమి రేటులో 50% రాయితి ఇచ్చుటకు ఏపీఐఐసీ వారు ప్రోత్సాహించెదరు.
- మెగా IT ప్రాజెక్ట్ నందు ఒక్కొక్క ఉద్యోగికి భూమి విలువలో రూ. 60,000/- గాని 80% మించకుండా రాయితి మరియు IT ప్రాజెక్ట్ నందు ఒక్కొక్క ఉద్యోగికి భూమి విలువలో రూ. 40,000/- గాని 80% మించకుండా రాయితి ఇచ్చి ఏపీఐఐసీ వారు ప్రోత్సాహించెదరు.
- APIIC వారు గుర్తించబడిన పరిశ్రమల ఏరియాలలో స్థానిక పారిశ్రామిక వేత్తలతో సర్వీస్ సొసైటీ ఏర్పాటు చేసి వారిచే కనీస వసతులు అయిన రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీ, నీటి సరఫరా మొదలగునవి ఏర్పాటు చేసి నిర్వహించెదరు.
నిర్మాణము :
ఏ.పి.ఐ.ఐ.సి. కార్యకలాపాలు :
భూ సేకరణ శాఖ:
- పరిశ్రమల కొరకు అవసరమైన మేరకు భూమిని గుర్తించి, భూ సేకరణ కొరకు అక్క్విజిషన్ / ఆలినేషన్ పంపుట.
- రెవిన్యూ అథారిటీ నుండి ల్యాండ్ పోసిషన్ తీసుకొని వాటిని రెవిన్యూ రికార్డులలో APIIC సంస్థ వారి పేరు మీద మార్పు చేయుట.
- వై.యస్.ఆర్. కడప జిల్లాలో పారిశ్రామిక వాడల స్థాపన కొరకు 11528.17 ఎకరముల భూమి సేకరించడమైనది.
- వై.యస్.ఆర్. కడప జిల్లాలో పారిశ్రామిక వాడల స్థాపన కొరకు 46104.35 ఎకరముల భూమి ల్యాండ్ బ్యాంకు క్రింద గుర్తించడమైనది.
- వై.యస్.ఆర్. కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో యం.యస్.యం.ఇ. పార్క్ లు ఏర్పాటు చేయుటకు 620.92 ఎకరముల భూమి గుర్తించడమైనది. మరియు 473.22 ఎకరముల భూమి APIIC ఆధీనములో ఉన్నది.
ఇంజనీరింగ్ శాఖ:
- వై.యస్.ఆర్. కడప జిల్లాలో పారిశ్రామిక వాడల స్థాపన కొరకు సేకరించిన భూమిలో లేఅవుట్ లు వేయడము.
- మౌలిక సదుపాయాలగు విద్యుద్దీకరణ, రహదారులు, కాలువలు, నీటి సదుపాయములు కల్పించడము మరియు మరమ్మత్తులు చేయడము.
- వై.యస్.ఆర్. కడప జిల్లాలో వివిధ పారిశ్రామిక వాడలలో 24452.12 లక్షలతో అభివృద్ధి పనులు / మౌలిక సదుపాయాలగు విద్యుద్దీకరణ, రహదారులు, కాలువలు, నీటి సదుపాయము మరియు మరమ్మత్తుల కొరకు వినియోగించడము జరిగినది.
అసెట్ మేనేజిమెంట్ శాఖ:
- వై.యస్.ఆర్. కడప జిల్లాలో పారిశ్రామిక వాడలలో పారిశ్రామిక వేత్తలకు అవసరానుగుణంగా భూమిని కేటాయించడము.
- పారిశ్రామిక వేత్తలు పరిశ్రమను స్థాపించి, ఉత్పత్తి జరిగిన తరువాత వారి యొక్క భూమిని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడము.
- వై.యస్.ఆర్. కడప జిల్లాలో పారిశ్రామిక వాడల స్థాపన కొరకు 2150.23 ఎకరముల భూమి వివిధ పారిశ్రామిక వాడలలో వివిధ రకముల పరిశ్రమల స్థాపన కొరకు కేటాయించడమైనది.
ముఖ్య వివరములు :
అధికారిక హోదా | కార్యాలయపు ఫోన్ నంబరు | సంప్రదించవలసిన ఫోన్ నంబరు | ఇమెయిల్ ఐ.డి. |
---|---|---|---|
జోనల్ మేనేజర్ | 08562-244520 | 9948098209 | zm.kad.apiic@nic.in |
డిప్యూటీ జోనల్ మేనేజర్(ఇ) | 08562-244520 | 9951609469 | – |
మేనేజర్ (ఎయం) | 08562-244520 | 9989050286 | – |
ఆర్.టి.ఐ. :
కార్యాలయపు చిరునామా | అధికారిక హోదా | సంప్రదించవలసిన ఫోన్ నంబరు |
---|---|---|
O/o. ది జోనల్ మేనేజర్ ఏపీఐఐసీ లిమిటెడ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, కడప – 516004 08562-244520 |
మేనేజర్ (ఎయం) / పౌర సమాచార సహాయ అధికారి | 9989050286 |
డిప్యూటీ జోనల్ మేనేజర్ (ఇ) / పౌర సమాచార సహాయ అధికారి | 9951609469 | |
జోనల్ మేనేజర్ / పౌర సమాచార అధికారి | 9948098209 | |
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ / అప్పిలేట్ అధికారి | 9705285666 |
డిపార్ట్మెంట్ సందర్శనపై మరింత సమాచారం కోసం APIIC యొక్క అధికారిక వెబ్ సైట్ : www.apiic.in
ఏపీఐఐసీ ల్యాండ్స్‌లోని ప్రధాన పరిశ్రమలు:
దీనిపై క్లిక్ చేయండి: – ఎపిఐఐసి – ప్రధాన పరిశ్రమలు