ఉద్యాన శాఖ
పరిచయం
- ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ద్వారా ఉద్యాన రంగాన్ని సంపూర్ణంగా వృద్ది చేయడం ఈ ప్రాంతీయ ప్రణాళికలలో పరిశోధనను, సాంకేతికతను ప్రోత్సహించి విస్తర్ణ, కోత అనంతర యాజమాన్యం, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అంశాలు ఉండాలి. ఇవి వివిధ వ్యవసాయ వాతావరణ పరిస్థితులు కలిగిన రాష్ట్రాలలో ఒక రాష్ట్రానికి కలిగే లాభాలతో పోల్చినప్పుడు అనుగుణంగా ఉండాలి.
- రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహించి వారి ఆదాయ వనరులను మరియు నాణ్యమైన ఉత్పత్తులను పెంపొందించడం.
- ఉద్యాన రంగంలో రైతులను వారి ఆదాయాన్ని పెంపొందించి తద్వారా దేశానికి ఆహార భద్రత కల్పించడం.
- నాణ్యమైన విత్తనాలు మరియు మొక్కలు వినియోగించి, సూక్ష్మ సేద్య పద్దతులను అవలంభించి ఉత్పాదకతను పెంపొందించడం.
- ఉద్యాన పంటలపై శిక్షణల ద్వారా నైపుణ్యం పెంపొందించి గ్రామీణ యువతకు ముఖ్యంగా కోత అనంతర యాజమాన్యం నందు ఉపాధి అవకాశం కల్పించడం
అర్గనోగ్రాం
పథకము/కార్యాచరణ
వ. సంఖ్య | పథకము పేరు | నిధుల స్వభావము | ముఖ్య ఉద్దేశ్యం |
---|---|---|---|
01 | సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ | కేంద్ర ప్రాయోజిత పథకం | పండ్లు, పూలు మరియు మౌళిక వాస్తున అభివృద్ధి |
02 | రాష్ట్ర ప్రణాళిక పథకం | రాష్ట్ర ప్రాయోజిత పథకం | |
03 | రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం (రాఫ్తార్) | ఆంధ్ర ప్రాయోజిత పథకం | కూరగాయల సాగు మరియు అభివృద్ధి |
- అన్ని కాలములలోను నాణ్యమైన కూరగాయల ఉత్పత్తి మరియు అధిక దిగుబడి సాదించుట లక్ష్యంగా పాలిహౌస్ నిర్మాణం, షేడ్ నెట్ హౌస్ మరియు ప్లాస్టిక్ మల్చింగ్ ని ప్రోత్సహించడం.
- టమోటా లో ఉత్పత్తి, ఉత్పాదకత మరియు నాణ్యతను పెంచడానికి ఊతకర్రల విధానాన్ని ప్రోత్సహించడం.
- 20 సం||లు పైబడిన మామిడి మరియు 8 సం||లు పైబడిన చీనీ/నిమ్మ తోటలలో ఉత్పత్తి పెంచడానికి కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, చీడ పీడల నివారణ మొదలగు పనులు చేపట్టడం.
- పంట కోత అనంతరం జరిగే నష్టాన్ని అరికట్టి పంట నాణ్యతను పెంచి మార్కెటింగ్ చేయడానికి వీలుగా ప్యాక్ హౌస్ లు నిర్మాణం చేపట్టడం.
- తీగజాతి కూరగాయల సాగులో శాశ్వత పందిర్ల నిర్మాణం.
- రీతులకు కావలసిన చిన్న ట్రాక్టర్లు, పవర్ టిల్లర్స్, రోటోవేటర్స్, తైవాన్ స్ప్రేయర్స్ మొదలగు పరికరములు రాయితీ పై సరఫరా చేయడం.
సమాచారం కొరకు | హోదా | సెల్ నం. |
---|---|---|
01 | ఉద్యాన ఉప సంచాలకులు | 7995086788 |
02 | సహాయ సంచాలకులు | 7995086785 |
03 | సహాయ సంచాలకులు | 7995086787 |
ఈమెయిలు ఐడి
1) ddhorticulturekdp@gmail.com
2) adh.kdp@gmail.com
3) adh2kdp@gmail.com