భూగర్భ జల మరియు జల గణన శాఖ
సూచనా దృశ్యం:
- భూగర్భ జల మరియు జల గణన శాఖ 1971 సంవత్సరంలో ఏర్పాటై, చిన్న నీటి పారుదల పధకాలు అమలు చేయు ఆర్ధిక సంస్ధలకు భూగర్భ జల విశ్లేషణ మరియు తగు సిఫారసులు రాష్ట్రంలో అందజేయుచున్నది. మొదట ఈ శాఖ రాష్ట్ర సచివాలయంలో చిన్న కార్యాలయంగా ఏర్పాటై తదుపరి కేంద్ర భూగర్భ జల సంస్ధ తరహాలో విస్తరింపబడినది. మొదట ఐదు సంవత్సరాలు కేంద్ర భూగర్భ జల సంస్ధ మరియు భారత భూగర్భ జల పరిశోదన సంస్ధలకు సంబందించిన అధికారులు సారధ్యం వహించారు.
- ఈ శాఖ భూగర్భ జల వనరుల అభివృద్ధి మరియు యాజమాన్యం నిర్వహణకై పలు విభాగాములతో కూడినది. ఈ శాఖ, జల వనరులు శాఖలో ఒక్కటై రాష్ట్ర స్థాయిలో సంచాలకులు, జిల్లా స్థాయిలలో ఉప సంచాలకులు సారధ్యం వహిస్తారు.
- ఈ శాఖ భూ విజ్ఞాన, భూజల విజ్ఞాన, భూ భౌతిక సర్వేలు మరియు నీటి నాణ్యత విశ్లేషణ మొదలగు విధులను నిర్వహిస్తుంది.
- ఈ శాఖ త్రవ్వకపు బావులు, బోర్ బావులు, ఫిల్టర్ బావులుకు ఇసుక రేవులు మొదలగు పధకాలు అమలు చేయు వివిధ సంస్ధ లకు సర్వే నిర్వహించి సిపరస్సు చేస్తుంది. ఈ శాఖ ఆంధ్ర ప్రదేశ్ వాల్టా చట్టం 2002-2004 ప్రకారం షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, వెనుకబడిన కులాల అభివృద్ది సంస్ధ లకు గ్రామీణ త్రాగు నీటి సరఫరా శాఖ, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమల శాఖ, పరిశ్రమల శాఖలకు, రైతులకు, గృహస్తులకు భూగర్భ జల సర్వే నిర్వహించి తగు సిఫారస్సులను చేయుచున్నది.
- నీటి పారుదల, పంచాయతి, జిల్లా నీటి యాజమాన్య, అటవీ మొదలగు శాఖలకు కృతిమ భూగర్భ జల రీఛార్జి నిర్మాణాల కొరకు సర్వే నిర్వహించి స్థల ఎంపిక చేస్తుంది. భూగర్భ జల నిల్వలను, వినియోగం, మిగులు (వాటర్ షెడ్) గ్రామాల వారీ వర్గీకరణ (అత్యదిక/సంక్లిష్ట/పాక్షిక సంక్లిష్ట/సురక్షిత వినియోగం) నియతకాల పరిమితులలో అంచనా చేస్తుంది.
- ఫిజోమీటర్లు, పరిశీలక బావుల ద్వార ఆయకట్టు, ఆయకట్టేతర ప్రాంతాలలో భూగర్భ జల మట్తలను సేకరిస్తూ భూగర్భ జల నాణ్యతను కూడా విశ్లేషిస్తుంది.
- వాల్టా చట్టం 2002-2004 అమలులో జిల్లా యంత్రాంగానికి ఈ శాఖ సాంకేతిక సహాయ సంచాలకులు అందిస్తుంది.
- షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల లబ్దిదారులకు ఉప ప్రణాళిక ద్వార బోర్ బావులు నిర్మాణం చేపడుతుంది.
ముఖ్య / ప్రధాన విధులు:
- భూగర్భ జల వనరుల గణన నిర్ణీత కాలంలో చేపడుతుంది.
- అధిక భూగర్భ జల నిల్వల ప్రాంతాలకు గుర్తిస్తుంది.
- బావులు/బోర్ బావులు . ఫిజోమీటర్లు/రీఛార్జి నిర్మాణాలు / ప్రయోగాత్మక బోర్ బావుల డ్రిల్లింగ్ కొరకు స్థల ఎంపిక చేస్తుంది.
- చిద్రన యంత్రాల (రిగ్గు) నమోదు.
- భూగర్భ జల మట్టాల సేకరణ మరియు జల నాణ్యత విశ్లేషణ.
- మిశ్రమ (ఉపరితల – భూగర్భ) నీటి వినియోగం అధ్యయనం.
- భూ ఉపరితల ఛాయ చిత్రం ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ.
- నీటి పరివాహక ప్రాంతాల మరియు కృతిమ రీఛార్జి నిర్మాణాల విశ్లేషణ.
- ఇతర ఆర్ధిక సహాయ స్థల పధకాలు.
- హైడ్రాలజీ ప్రాజెక్ట్ ఫేజ్ 1, 2 మరియు ఫేజ్ -3 .
- ఆంధ్ర ప్రదేశ్ సమీకృత నీటి పారుదల మరియు వ్యవసాయ పరివర్తన పధకం.
- ఎత్తి పోతల పధకం స్థల ఎంపిక.
- పరిశ్రమలు / గనులకు పర్యావరణ అనుమతులకు సర్వే.
- ఇసుక క్వారీ ద్వార భూగర్భ జలాల పై కలుగు ప్రభావాన్ని అధ్యయనం.
- ఆంధ్ర ప్రదేశ్ వాల్టా చట్టం అమలులో సాంకేతిక సహాయం అందించుట.
- భూగర్భ నివేదికలు, చిత్రాల తయారీ మరియు అందుబాటులో ఉంచుట.
- భూగర్భ జల యాజమాన్య పద్దతుల పై అవగాహనా కల్పించుట.
- కృత్రిమ రీఛార్జి నిర్మాణాల ప్రభావాన్ని అధ్యయనం చేయుట.
- గ్రామాల వారి భూగర్భ జల వనరుల అధ్యయనం / అంచనా.
- నీటి గణన.
- చేపల / రొయ్యల చెరువుల (ఆక్వా కల్చర్) సాంకేతిక అనుమతులకై సర్వే.
- పరిశ్రమలు / గనుల అవసరాలకు భూగర్భ జల వినియోగంకై నిరభ్యంతర పత్రం కొరకు సర్వే.
- తీర ప్రాంతం నందు సముద్రజల చొరబటుపై అధ్యయనం.
- భూగర్భ జలాన్వేషణ నూతన సాంకేతిక / యాంత్రిక నియోగం పై ఈ శాఖలో క్షేత్ర స్థాయి అధికారులకు తగు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుట.
- కరువుపై జిల్లా అధికారులకు సాంకేతిక నివేదిక సమర్పించుట.
- సాంకేతికపరంగానే కాకుండా జిల్లా అధికారుల సూచనా మేరకు ప్రభుత్వ పరిపాలనాపరంగా ఎన్నికలు, పరీక్షలు, ప్రకృతి విలయం మొదలగు సమయములో విధులు నిర్వర్తిoచుట