ప్రజారోగ్య మరియు పురపాలక సాంకేతిక శాఖ
ముఖ చిత్రము(పరిచయము):
ప్రజారోగ్య మరియు పురపాలక సాంకేతిక శాఖ పురపాలక పాలనా మరియు పట్టణ అభివృద్ధి శాఖ సంచాలకుల పరిపాలిక ఆధీనంలో ఉన్నది.
కార్యకలాపాలు:
ఈ శాఖ 9 పురపాలికలలో (5 పురపాలికలు, 1 నగర పాలక సంస్థ మరియు 3 నగర పంచాయితీలలో) నీటి సరఫరా మరియు మురుగునీటి పథకములు రూపకల్పనలు రూపొందిచడం మరియు నిర్మాణములకు ప్రాతినిధ్యము వహిస్తూ కార్యనిర్వాహక సాంకేతిక అధికారి ఉద్యోగము (క్యాడర్) లేని 7 పురపాలికలలో అన్ని ఇంజనీరింగు పనులను సాంకేతిక నియంత్రణ మరియు ఆ పథకముల నిర్మాణం అనంతరమువాటిని పురపాలికలకు నిర్వాహణ నిమిత్తం అప్పగించడము.
వ్యవస్థ రేఖా పటము
ముఖ్య కార్యకలాపాలు:
ప్రజారోగ్య మరియు పురపాలక సాంకేతిక శాఖ కార్యనిర్వాహక సాంకేతిక అధికారి పరిధిలోని పురపాలికలలో ఈ క్రింది సేవలను నిర్వర్తించుచున్నది.
- పనుల అంచనాల సాంకేతిక మంజూరు.
- పురపాలికలలోని పనులను టెండర్ల ఖరారుకు సాంకేతిక అభిప్రాయము మంజూరు చేయడము.
- పురపాలక ఇంజనీర్లు నిర్వహించిన పనులకు కొలతల తనిఖి చేయుట.
- పురపాలికలు నిర్వహించుచున్ననీటి సరఫరా మరియు మురుగునీటి పథకాల కాలనిడివి తనిఖీలు చేపట్టడము.
- కార్యనిర్వాహక సాంకేతిక అధికారి పరిధిలో ఉండి సాంకేతిక సహకారము అందించుచున్న పురపాలికలు ఈ క్రింద తెలుపబడినవి.
-
- రాయచోటి పురపాలక సంఘము.
- బద్వేలు పురపాలక సంఘము.
- మైదుకూరు పురపాలక సంఘము.
- పులివెందుల పురపాలక సంఘము.
- జమ్మలమడుగు నగర పంచాయితి.
- రాజంపేట నగర పంచాయితి.
- ఎర్రగుంట్ల నగర పంచాయితి.
ముఖ్య సమాచారము:
ఆఫీసరు హోదా | ఇ-మెయిల్ ఐడి | సంప్రదించవలసిన సెల్ నేంబరు |
కార్యనిర్వాహక సాంకేతిక అధికారి, ప్రజారోగ్య విభాగము, కడప. | eephkdp2007@gmail.com | 7073199224 |
ఉప కార్యనిర్వాహక సాంకేతిక అధికారి, ప్రజారోగ్య ఉప విభాగము, కడప. | deephkdp@gmail.com | 9666340103 |
ఉప కార్యనిర్వాహక సాంకేతిక అధికారి, ప్రజారోగ్య ఉప విభాగము, పులివెందుల. | deeplvd2@gmail.com | 9666340103 |
ఉప కార్యనిర్వాహక సాంకేతిక అధికారి, ప్రజారోగ్య ఉప విభాగము, ప్రొద్దుటూరు. | deephpdtr@gmail.com | 9989539068 |
వెబ్ సైటు:
www.appublichealth.gov.in