ముగించు

జిల్లా కలెక్టర్ వైయస్ఆర్ జిల్లా ద్విభాషా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు

ప్రచురణ తేది : 05/07/2019
Launch of website

డిజిటల్ ఇండియా నాల్గవ వార్షికోత్సవం పురస్కరించుకొని వైఎస్ఆర్  జిల్లా కలెక్టర్ శ్రీ సి.హరి కిరణ్ గారు నూతనంగా రూపొందించిన వైఎస్ఆర్ జిల్లా వెబ్ సైట్ https://kadapa.ap.gov.in ను 01/07/2019 తేదిన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఎం.గౌతమి గారు, డి.ఆర్.ఓ. శ్రీ రఘునాథ్ గారు, ఎన్.ఐ.సి. అధికారులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వెబ్ సైట్ ను ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో కొత్త హంగులతో రూపొందించడం జరిగిందని, ఇది స్మార్ట్ ఫోన్లలో, టాబ్లెట్ పి.సి. లలో, మరియు కంప్యూటర్ లో సులభముగా చదువగలమని తెలిపారు.