సర్వ శిక్షా అభియాన్
సర్వశిక్షాఅభియాన్ – పాఠశాలల నిర్వహణలో సమాజం యొక్క చురుకైన భాగస్వామ్యంతో, సామాజిక, మరియు లింగ అంతరాలను తగ్గించడం ద్వారా 6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉపయోగకరమైన ప్రస్తుత ప్రాథమిక విద్యను అందించడం అనే లక్ష్యం తో ఉన్నది.
సర్వశిక్షాఅభియాన్ – విస్తృతి
- సార్వత్రిక ప్రాథమిక విద్య కోసం స్పష్టమైన కాల పరిమితి కలిగిన కార్యక్రమము.
- దేశ వ్యాప్తంగా నాణ్యమైన ప్రాథమిక విద్య డిమాండ్‌కు ప్రతిస్పందన.
- ప్రాథమిక విద్య ద్వారా సామాజిక న్యాయాన్నిప్రోత్సహించే అవకాశం.
- పంచాయతీ రాజ్ సంస్థలు, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ లు , గ్రామ, పట్టణ మరియు మురికివాడల విద్యాకమిటీలను సమర్థవంతంగా చేర్చే ప్రయత్నం.
- దేశ వ్యాప్తంగా సార్వత్రిక ప్రాథమిక విద్య కోసం రాజకీయ సంకల్పం యొక్క వ్యక్తీకరణ.
- కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యం.
- ప్రాథమిక విద్య పై రాష్ట్రాలు తమ సొంత దృష్టిని పెంపొందించుకునే అవకాశం
లక్ష్యాలు:
- పిల్లలందరూ పాఠశాలలు , విద్యహామీకేంద్రాలు , ప్రత్యామ్నాయ పాఠశాలల్లో పాఠశాల శిబిరానికి వచ్చేలా చేయటం.
- పిల్లలు ఐదు సంవత్సరాల ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేసేలా చూడటం.
- పిల్లలందరూ ఎనిమిది సంవత్సరాల ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేసేలా చూడటం.
- విద్యద్వారాసంతృప్తికరమైన జీవితానికి ప్రాధాన్యత నిస్తూ నాణ్యత గల ప్రాథమిక విద్య పై దృష్టి పెట్టడం
- ప్రాథమిక విద్య లో గల అన్నిలింగ, వర్గ మరియు సామాజిక అంతరాలను తగ్గించడము.
అనుసంధానం:
- కొత్త ప్రాథమిక పాఠశాలలను తెరవడం.
- ప్రాథమిక పాఠశాలలను ప్రాధమికోన్నతపాఠశాలలు గా ఉన్నతీకరించడం.
- ఎనిమిదవ తరగతిని ఉన్నత పాఠశాలలతో అనుసంధానం చేయడం.
- విద్యాహక్కుచట్టం ప్రకారం కొత్తపాఠశాలలకు (ప్రాథమిక మరియు ప్రాధమికోన్నత ) సాధారణ ఉపాధ్యాయులను మరియు ఇప్పటికే ఉన్న పాఠశాలలకు అదనపు ఉపాధ్యాయులను మంజూరు చేయడం.
- సివిల్ పనులు – పాఠశాల భవనాల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం , స్కూల్‌కాంప్లెక్స్ కోసం మండల వనరుల కేంద్ర భవనాల గదులు, ప్రహరీ గోడలు,మరుగుదొడ్లు, విద్యుదీకరణ మరియు తాగు నీటి సౌకర్యాలు కల్పించడం.
- మండల వనరుల కేంద్రాలు మరియు పాఠశాల సముదాయాలు ను బలోపేతం చేయటం.
- పాఠశాల నిర్వహణ నిధులు, పాఠశాల నిధులు & ఉపాధ్యాయ నిధులను విడుదల చేయటం.
- ప్రాథమిక మరియు ప్రాధమికోన్నత పాఠశాలల బోధనాభ్యాసన పరికరాలను మంజూరు చేయట.
- ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం.
- బాలికల విద్య, బాల్య విద్య, ఎస్సీలు మరియు ఎస్టీల విద్య, పట్టణ అణగారిన వర్గాల పిల్లల మైనారిటీ పిల్లల కోసం వినూత్న కార్యకలాపాలను అమలు చేయటం.
- ప్రాథమికోన్నతపాఠశాలలకు కంప్యూటర్ విద్య.
- పరిశోధన, మూల్యాంకనం, పర్యవేక్షణ.
- ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు కార్యక్రమాలు.
- సంఘ నాయకులకు శిక్షణ.
- బడి మానివేసిన పిల్లలను పాఠశాల ప్రధాన స్రవంతిలోకి తెచ్చేందుకొరకు రెసిడెన్షియల్ / నాన్ రెసిడెన్షియల్ కేంద్రాలను ప్రారంభించడం.
- ప్రతి సంవత్సరం I నుండి VIII తరగతులలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరికీ 2 జతల ఉచిత సమరూప దుస్తులు అందచేయడం.
- పట్టణ ప్రాంతాలలో అణగారిన వర్గాల పిల్లలకు ప్రత్యేక నివాస పాఠశాలలను నడపడం.
- పాఠశాలలు లేని ఆవాస ప్రాంతాలలో గల పిల్లలకు రవాణా ఛార్జీలు అందించడం.
నిర్వహణ నిర్మాణం:
జిల్లాస్థాయిలో, జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రాజెక్టు కు చైర్మన్ గా ఉన్నారు. ప్రాజెక్ట్ వ్యూహాలను అమలు చేయడానికి మరియు ప్రాజెక్ట్ సమస్యల పై ప్రధానంగా దృష్టి పెట్టడానికి ప్రాజెక్ట్ అధికారులను నియమిస్తారు.
ప్రాజెక్ట్ అధికారికి 6 విభాగాల అధికారులు సహకరిస్తారు.
- విద్యా పర్యవేక్షణ అధికారి : బోధన, విద్యారంగ పరిశోధన, విశ్లేషణ , ఉపాధ్యాయుల సామర్థ్యం పెంపు కొరకు.
- కమ్యూనిటీ మొబిలైజేషన్ఆఫీసర్ : సంఘ సమీకరణకు సంబంధించిన సమస్యలను చూసుకోవడం.
- సహిత విద్య సమన్వయ కర్త : ప్రత్యేక విద్యా అవసరాలున్న పిల్లల సమస్యలను చూసుకుంటారు
- ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయకర్త : బడి బయట ఉన్న బడిమాని వేసిన పిల్లలకు సంబంధించిన సమస్యలను చూసుకోవడం
- బాలికా విద్య అభివృద్ధి అధికారిణి : బాలికల విద్యకు సంబంధించిన కార్యకలాపాలను చూసేందుకు ఒక మహిళా అధికారిని కూడా నియమించడం జరిగింది. వీరు ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య ఒక వైపు మరియు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు మరొకవైపు పర్యవేక్షించెదరు.
- సమాచార నిర్వహణ వ్యవస్థ మరియు ప్రణాళిక అధికారి : కంప్యూటర్అప్లికేషన్లలో పరిజ్ఞానం ఉన్న గజెటెడ్ ఆఫీసర్ హోదా లో ఉన్న అధికారిని విద్యాశాఖ నుండి ఎం ఐ యెస్ వింగ్ యొక్క ఎం ఐ యెస్ & ప్లానింగ్ కోఆర్డినేటర్ గా తీసుకొనబడుచున్నది.
- ఫైనాన్స్&అకౌంట్స్ఆఫీసర్ : ప్రాజెక్ట్ ఖాతా లను క్రమ పద్ధతి లో నిర్వహించడానికి, అసిస్టెంట్ ఆఫీసర్ హోదా లో ఒక అధికారిని ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీసర్ గా నియమించడం జరుగుతుంది.
- ఎగ్జిక్యూటివ్‌ఇంజనీర్ : సివిల్ పనుల కొరకు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల నుండి తీసుకొనబడుచున్నది.