ముగించు

కార్యాలయ కార్యకలాపాల గురించి సంక్షిప్త నివేదిక

కార్యాలయము లొకేషన్ :

జిల్లా ఉపాధి కార్యాలయము కడప నగరము లోని కొత్త కల్లెక్టరేట్ ప్రాంగణము లోని ‘ఒ’ బ్లాక్ నందు ఉన్నది

కడప జిల్లా ఉపాధి కార్యాలయము యొక్క ముఖ్యమైన కార్య కలాపాలు :

  1. రోజు వారి నిరుద్యోగుల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్సు మరియు మైన్టేనన్స్ పనులు
  2. వొకేషనల్ గైడెన్స్ కు సంబంధించిన కార్యకలాపాలు
  3. ఎంప్లాయిమెంట్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ (EMI) కార్యకలాపాలు
  4. ఉద్యోగ మేళాలు
  5. ఔట్సౌర్సింగ్ కి సంబంధించిన కార్యకలాపాలు
  6. OMCAP కి సంబంధించిన కార్యకలాపాలు

 

  1. రోజు వారి నిరుద్యోగుల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్సు మరియు మైన్టేనన్స్ పనులు :
    31-07-2019 వరకు YSR కడప  జిల్లా ఉపాధి కార్యాలయము నందు నమోదైన నిరుద్యోగుల సంఖ్య 71,851. విద్యా అర్హతల వారి గా రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగుల వివరములు కింద తెలపడమైనది:
Qualification Total S C ST BC Total Women
S.S.C.Pass 17966 6418 1284 9421 4784
Intermediate pass 16695 5419 1265 6978 5261
Degree Holders 16578 4514 1013 6964 5634
Stenographers 190 84 51 6 702
B.E.D.Teachers 4500 1099 226 1536 101
Typist 1987 538 91 654 1967
S.G.B. Teachers 1420 282 108 481 490
Diploma Holders L.C.E. 757 111 23 169 113
L.A.E. 404 96 27 132 29
L.E.E. 752 154 61 296 453
Other Dip.Holders 1492 405 127 540 555
ITI/Apprentice Holders 6788 2224 67 212 637
Nursing 1370 403 110 306 1565
S.S.C. Fail & Up to 7th Pass 536 90 100 202 487
6th class, illiterate & Skilled/unskilled 416 143 75 181 264
Total: 71,851 21,980 4,628 28,078 23042

                      సాధారణముగా, రిజిస్ట్రేషన్ కార్డు 3 సంవత్సరముల వరకు చెల్లుతుంది. వికలాంగులకు జీవిత కాలము చెల్లుతుంది. 3 సంవత్సరముల మునపే, నిరుద్యోగులు రెన్యువల్ కొరకు కర్యలమును సంప్రదించ వలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారి సీనియారిటీ కొనసాగుతుంది. లేనియెడల 6 నెలల గ్రేస్ పీరియడ్ ముగిసిన చొ వారి యొక్క రిజిస్ట్రేషన్ కార్డు లాప్సే(lapse) అవ్వును. అలాగే, నిరుద్యోగులు వారి అదనపు విద్యా అర్హ్యతలు కానీ, చిరునామా మార్చుకొనుట కానీ, పేరు స్పెల్లింగ్ కానీ, పుట్టిన తేది కానీ సరిచేసుకోనుట కు కార్యాలయమును సంప్రదించగలరు. ఇవన్ని మైన్టేనన్స్ కింద జరుగును.

               ఏదైనా ప్రభుత్వ శాఖ కానీ,  ప్రైవేటు సంస్థ కానీ,  ఖాలీల భర్తీ కొరకు ఉపాధి కార్యాలయమును కోరినచో, మా యందు నమోదైన నిరుద్యోగుల సీనియారిటీ ప్రకారము, వారి విద్యా అర్హతల ప్రకారము మరియు రోస్టర్ ప్రకారము 1:20 నిష్పత్తి నందు వారి వివరములు ఆయా శాఖలకు పంపించ బడును.

2) వొకేషనల్ గైడెన్స్ కు సంబంధించిన కార్యకలాపాలు :

             ఇందులో భాగంగా జిల్లా ఉపాధి అధికారి మరియు జూనియర్ ఉపాధి అధికారి నిరుద్యోగులకు వారి ఉపాధి అవకాశాల గురించి సూచనలు మరియు తగిన మార్గనిర్దేశము చేయవచ్చును. ఇందు గురించి వారు జిల్లా లోని వివిధ విద్యా సంస్థలను అనగా బడులు, జూనియర్ కాలేజీ లు, సంక్షేమ హాస్టల్సు సందర్శించి విద్యార్థులకు సూచనలు ఇవ్వగలరు.

ఇందులో భాగంగా కడప జిల్లా ఉపాధి అధికారి, ప్రాంతీయ ఉపాధి అధికారి,కర్నూల్ మరియు జూనియర్ ఉపాధి అధికారి కడప వారందరూ కడప నగరము నందు ఉన్న ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి వారికి ఉపాధి అవకాశముల గురించి వివరిస్తూ సైకో మెట్రిక్ టెస్టు ను నిర్వహించడం జరిగినది. మొత్తం 117 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగినది.

ప్రాంతీయ ఉపాధి అధికారి, జిల్లా ఉపాధి అధికారి మరియు జూనియర్ ఉపాధి అధికారి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించుట

 

సైకో మెట్రిక్ టెస్టు కు హాజరైన ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ విద్యార్థులు

 

 

3)ఎంప్లాయిమెంట్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ (EMI) కార్యకలాపాలు :

EMI కార్యకలాపాలు EMPLOYMENT EXCHANGES (COMPULSORY NOTIFICATION OF VACANCIES) ACT, 1959 ని ఆధారముగా చేసుకొని జరుగును. ఇందులో భాగంగా 25 లేదా అంతకు ఎక్కువ మంది పనిచేయు ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల నుండి వారి సంస్థ లో పని చేయు మొత్తము  ఉద్యోగుల సంఖ్య, పురుష మరియు మహిళా ఉద్యోగుల సంఖ్య సేకరింపబడును. ఈ వివరములు మూడు నెలలకొకసారి కమీషనర్, ఉపాధి కార్యాలయము, విజయవాడ వారికి పంపబడును.

4)ఉద్యోగ మేళాలు:

ప్రైవేటు సంస్థల నందు ఉద్యోగ అవకాశాలను కల్పించుట కొరకు, కడప జిల్లా ఉపాధి కార్యాలయము నందు నెల కు 3 ఉద్యోగ మేళాలు నిర్వహించబడును. ఈ విధముగా జిల్లా లో ఉన్న నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశములను కల్పించడం జరుగుతున్నది. ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్న కొన్ని సంస్థల వివరములు : వినూత్న ఫెర్టిలైసేర్స్, LIC, SBI లైఫ్, SIS సెక్యూరిటీ, అమర్ రాజా , యూత్ ఫర్ జాబ్స్ మొదలగునవి.

Sl.No Year Mega Job melas Mini Job melas No.of Employers Participated No.of candidates attended No.of candidates Selected
1 2016 0 27 27 2179 635
2 2017 1 13 18 1752 463
3 2018 1 36 42 1791 967

Month wise during 2019:-

Sl.No Month No.of Job melas conducted No.of Employers Participated No.of candidates attended No.of candidates Selected
1 January 2019 2 2 75 42
2 February 2019 1 1 14 5
3 March 2019 General Elections Code
4 April 2019 General Elections Code
5 May 2019 1 1 20 13
6 June 2019 3 3 108 29
7 July 2019 3 3 196 31

స్విగ్గి సంస్థ వారు నిర్వహించిన ఉద్యోగ మేళా నందు పాల్గొని ప్రసంగిస్తున్న శ్రీ పెంచల్ ప్రసాద్ గారు, ప్రాంతీయ ఉపాధి అధికారి, కర్నూలు.

వినూత్న 

ఫెర్టిలైసేర్స్ వారు నిర్వహించిన ఉద్యోగ మేళా నందు మార్కెటింగ్ executives గా నియమింపబడిన అభ్యర్థులతో జిల్లా ఉపాధి అధికారిణి శ్రీమతి పి. దీప్తి , జూనియర్ ఉపాధి అధికారులు శ్రీ S.V. రమణ గారు మరియు శ్రీ దోణప్ప గారు.

5)ఔట్సౌర్సింగ్ కి సంబంధించిన కార్యకలాపాలు :

G.O. MS No.151 ప్రకారము, జిల్లా అవుట్ సోర్సింగ్ కమిటి లో జిల్లా కల్లెక్టరు గారు చైర్మిన్ గా, జిల్లా ఉపాధి అధికారి కన్వీనర్ మెంబెర్ గా, ఉప సంచాలకులు, ట్రేజరి మరియు డిప్యూటీ కమీషనర్ అఫ్ లేబర్ వారు ఇతర కమిటి మెంబెర్లు గా వ్యవహరిస్తూ, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నియామక ప్రక్రియ లో పల్గోనుచున్నారు.

6) OMCAP కి సంబంధించిన కార్యకలాపాలు :

ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ (OMCAP) అను సంస్థ భారత దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ వారి చే అనుమతింపబడినది. జిల్లా ఉపాధి అధికారి ఈ సంస్థ యొక్క జిల్లా మేనేజర్ గా పరిగణింప బడును. ఈ సంస్థ ద్వారా గల్ఫ్ దేశాల యందు ఇంటి పని మరియు నర్సులు గా పని చేయుటకు వెల్ల గోరె మహిళల ను  సరైన భద్రత తో మరియు ఉచితము గా  ప్రభుత్వము ద్వారా పంపించ బడును.

ICDS సూపర్వైజర్స్ మరియు CDPOలకు నిర్వహించిన అవగాహన సదస్సు నందు ప్రసంగిస్తున్న శ్రీ స్వామి గారు, జనరల్ మేనేజర్, OMCAP, పాల్గొన్న వారు ప్రాంతీయ ఉప సంచాలకులు,ICDS, ప్రాజెక్ట్ డైరెక్టర్,ICDS మరియు  జిల్లా ఉపాధి అధికారిణి.

OMCAP ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్ళే మహిళలకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమము లో పాల్గొన్న శ్రీమతి పి. దీప్తి, జిల్లా ఉపాధి అధికారిణి.