సూచన ద్రిశ్యం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ 1979వ సంవత్సరంలో కంపెనీల చట్టం క్రింద రెజిస్టర్ కాబడి ప్రారంభించబడినది. నలభై సంవత్సరముల నుంచి ఇల్లు లేని బలహీన వర్గాల వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమైనది.
సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఎమనగా బలహీన వర్గాల వారు గౌరవముగా మర్యాద పూర్వకంగా మరియు అందమైన ఇల్లు కలిగి ఉండాలన్నది. రాష్ట్రంలో ఇల్లు లేని దారిద్రరేఖకు దిగువ నున్న ప్రతియొక్క కుటుంబమునకు పక్కా గృహము నిర్మించి మరియు వాటికి కావలసిన ప్రాథమిక అవసరములు తీర్చుట.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సహాయ(నోడల్) సహకారము ఏజెన్సీగా గుర్తించి కేంద్ర ప్రభుత్వ మంజూరు చేయబడిన గ్రామీణ మరియు పట్టణ గృహములకు తగిన ఆర్థిక మరియు సాంకేతిక సహాయము.
ప్రభుత్వ ప్రాదాన్యమైన నవరత్న కార్యాచరణ పట్టికలో(మేనిఫెస్టో) ఇల్లు లేని ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు అని ఎనిమిదవ అంశంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రచురించినది. అందులో భాగంగా ఇరవై ఐదు లక్షల బలహీన వర్గ కుటుంబములకు రాబోవు ఐదు సంవత్సరములలో నిర్మించి గృహ ప్రవేశము నాడు అక్కాచెల్లెలు పేరిట రిజిస్టరు చేసి అందజేయవలెను. వారికి భవిష్యతులో ఏదేని అవసర నిమ్మితము పావలా వడ్డీకి ఋణములు బ్యాంకుల ద్వారా అందచేయుటకు తగిన చర్యలు గైకొనవలెను.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ గడచిన నలభై సంవత్సరముల నుండి సుమారు 4 .89 లక్షల ఇల్లు వై ఎస్.ఆర్ కడప జిల్లా నందు నిర్మించండమైనది.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్/జిల్లా కలెక్టరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, వై ఎస్.ఆర్ కడప జిల్లా వారి సారధ్యములో సుమారు 250 మంది ఉద్యోగుల సహాయ సహకార సాంకేతిక సలహాతో లబ్దిదారులకు నిర్ణితకాలములో చెల్లింపుల ద్వారా, సూచనల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వెబ్ సైట్ పధక సంచాలకుల ద్వారా పురోగతి చెందినది.
2018-19 వ సంవత్సరములో 19,354 గృహములు పూర్తి అయినవి.
అత్యధికంగా 2008-09 వ సంవత్సరములో 76,702 గృహములు పూర్తి అయినవి.
సంస్థలో పనిచేయు సిబ్బంది ఎల్లవేళలా పూర్తి ఉత్సాహబరితమున శక్తితో మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రభుత్వము కోరిక మేరకు ఇల్లులేని బలహీన వర్గముల వారికి గృహములు నిర్మించే ఆశయములో పాలుపంచుకొని నిర్మించి ఇచ్చుటకు పూర్తి స్థాయీలో ఎల్లవేళలా సమాయత్తంగా ఉన్నారు.
అర్గానోగ్రం
1983 ప్రారంభ దశ నుండి మంజూరు మరియు పూర్తి అయిన గృహముల పట్టిక
ముఖ్య వివరాలు
అధికారిక హోదా | ఈ మైయిల్ ఐడి | సంప్రదించవలసిన నెంబరు | కార్యాలయపు ఫోన్ నెంబర్ |
---|---|---|---|
పథక సంచాలకులు | cuddapahse@gmail.com | 7093930111 | 08562-249939 |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ యొక్క అధికారిక వెబ్ సైట్
http://www.apgovhousing.apcfss.in
ఛాయా చిత్ర దృశ్య మాలిక