నవరత్నాలు
ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న తొమ్మిది నవరత్న సంక్షేమ పథకాలు:
వైఎస్సార్ రైతు భరోసా
- ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇస్తాం. పంటవేసే సమయానికి మే నెలలో రూ.12,500 చొప్పున ఇస్తాం.
- పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రేమియమ్ మొత్తాన్ని మేమే చెల్లిస్తాం.
- రైతన్నలకి వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం.
- రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం.
- వ్యవసాయానికి పగటిపూటే 9 గం. ఉచిత కరెంట్.
- ఆక్వారైతులకు కరెంట్ ఛార్జీలు యూనిట్ కు రూ.1.50 కే ఇస్తాం.
- రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం.
- రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు.
- ప్రతి నియోజలకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజక వర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు.
- మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండవ ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్ కు రూ. 4 బోనస్.
- వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ రద్దు చేస్తాం, టోల్ టాక్స్ రద్దు చేస్తాం.
- ప్రమాదవశాత్తూ లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.7 లక్షలు ఇస్తాం. అంతే కాదు ఆ డబ్బును అప్పులవాళ్ళకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకువచ్చి ఆ రైతు కుటుంబానికి అందగా ఉంటాం.
అందరికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ
- వార్షిక ఆదాయం రూ. 5,00,000 దాటని అన్ని వర్గాల వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపు.
- వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.
- ఎన్ని లక్షలు ఖర్చాయినా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం.
- ఎక్కడ చికిత్స చేయించుకున్నా (హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై మొదలగున్నవి) ఆరోగ్యశ్రీ వర్తింపు.
- అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి.
- ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా ఆర్ధిక సహాయం.
- కిడ్నీ వ్యాధి, తలసేమియా ఇంకా ఇటువంటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10,000 పింఛన్ నెల నెలా ఇస్తాం.
- ఆరోగ్యశ్రీ సేవలు ఇంకా మెరుగ్గా పకడ్బందీగా అందిస్తూనే మరోవైపు రెండేళ్లలోగా కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రుల ముఖచిత్రాలు (ఫోటోలు) మీముందుంచుతాం. రెండేళ్ళ తర్వాత ఆ ఆసుపత్రి దశ దిశ మార్చి మారిన ముఖచిత్రాలు మీ ముందుంచుతాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల సంఖ్య అవసరమైన మేరకు పూర్తిగా పెంచుతాం.
అమ్మఒడి
- పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లీ భయపడొద్దు.
- పిల్లలని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15,000 ఇస్తాం.
పింఛన్ల పెంపు
- ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయస్సు 65 నుంచి 60కి తగ్గిస్తాం.
- అవ్వా తాతల పింఛన్ రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోతాం.
- వికలాంగులకు పింఛన్ రూ. 3,000 ఇస్తాం.
పేదలందరికీ ఇళ్ళు
- ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా పక్కా ఇళ్ళు కట్టిస్తాం.
- ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్ళు కట్టిస్తాం.
- ఇళ్ళ స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తాం. వారిపేరునే రిజిష్ట్రేషన్ చేస్తాం, ఇళ్ళు కూడా కట్టిస్తాం.
- ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్క చెల్లమ్మల పేరుతో రిజిష్ట్రేషన్.
- అంతేకాదు డబ్బు అవసరమైతే అదే ఇంటిమీద పావలా వడ్డీకే రుణం వచ్చేట్టుగా బ్యాంక్ లతో మాట్లాడుతాం.
ఫీజు రీయింబర్స్ మెంట్
- పేదవారి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం.
- పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ. 20 వేలు ప్రతి విద్యార్ధికి ఇస్తాం.
వైఎస్సార్ జలయజ్ఞం
- దివంగత మహానేత వై ఎస్ ఆర్ కలలు కన్న జల యజ్ఞాన్ని పూర్తి చేస్తాం.
- పోలవరం, పూలసుబ్బయ్య, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం.
- రక్షిత మంచినీరు – సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్దరిస్తాం, జలకళను తీసుకోస్తాం.
మద్యపాన నిషేధం
- కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది.
- మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి.
- అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తాం.
వైఎస్సార్ ఆసరా , వైఎస్సార్ చేయూత
- ఎన్నికల రోజు వరకు అక్కచెల్లమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం.
- అంతే కాదు మళ్ళీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం ఆ వడ్డీ డబ్బు మేమే బ్యాంక్ లకు అక్కచెల్లమ్మల తరపున కడతాం.
- వైఎస్సార్ చేయూత ద్వారా ప్రతి బిసి ,ఎస్సీ ఎస్టీ , మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం.
- ప్రస్తుతం కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా, ఏ కొందరికో అరకొరగ ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్డితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం.
- 45 సంవత్సరాలు నిండిన ప్రతి బిసి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ అక్కలకు వైఎస్సార్ చేయూత ద్వారా మొదట ఏడాది తరువాత దశలవారీగా రూ. 75 వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం