ముగించు

సర్వ శిక్షా అభియాన్

సర్వశిక్షాఅభియాన్  –  పాఠశాలల నిర్వహణలో సమాజం యొక్క చురుకైన భాగస్వామ్యంతో, సామాజిక, మరియు లింగ అంతరాలను తగ్గించడం ద్వారా  6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉపయోగకరమైన ప్రస్తుత ప్రాథమిక విద్యను అందించడం అనే లక్ష్యం తో ఉన్నది.

సర్వశిక్షాఅభియాన్ – విస్తృతి

  • సార్వత్రిక ప్రాథమిక విద్య కోసం స్పష్టమైన కాల పరిమితి కలిగిన కార్యక్రమము.
  • దేశ వ్యాప్తంగా నాణ్యమైన ప్రాథమిక విద్య డిమాండ్‌కు ప్రతిస్పందన.
  • ప్రాథమిక విద్య ద్వారా సామాజిక న్యాయాన్నిప్రోత్సహించే అవకాశం.
  • పంచాయతీ రాజ్ సంస్థలు, స్కూల్ మేనేజ్ మెంట్  కమిటీ లు , గ్రామ, పట్టణ మరియు మురికివాడల విద్యాకమిటీలను సమర్థవంతంగా చేర్చే ప్రయత్నం.
  • దేశ వ్యాప్తంగా సార్వత్రిక ప్రాథమిక విద్య కోసం రాజకీయ సంకల్పం యొక్క వ్యక్తీకరణ.
  • కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యం.
  • ప్రాథమిక విద్య పై  రాష్ట్రాలు తమ సొంత దృష్టిని పెంపొందించుకునే అవకాశం

లక్ష్యాలు:

  • పిల్లలందరూ పాఠశాలలు , విద్యహామీకేంద్రాలు , ప్రత్యామ్నాయ పాఠశాలల్లో పాఠశాల శిబిరానికి వచ్చేలా చేయటం.
  • పిల్లలు ఐదు సంవత్సరాల ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేసేలా చూడటం.
  • పిల్లలందరూ ఎనిమిది సంవత్సరాల ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేసేలా చూడటం.
  • విద్యద్వారాసంతృప్తికరమైన జీవితానికి ప్రాధాన్యత నిస్తూ నాణ్యత గల ప్రాథమిక విద్య పై దృష్టి పెట్టడం
  • ప్రాథమిక విద్య లో గల అన్నిలింగ, వర్గ మరియు సామాజిక అంతరాలను తగ్గించడము.

అనుసంధానం:

  • కొత్త ప్రాథమిక పాఠశాలలను తెరవడం.
  • ప్రాథమిక పాఠశాలలను ప్రాధమికోన్నతపాఠశాలలు గా ఉన్నతీకరించడం.
  • ఎనిమిదవ  తరగతిని ఉన్నత పాఠశాలలతో అనుసంధానం చేయడం.
  • విద్యాహక్కుచట్టం ప్రకారం కొత్తపాఠశాలలకు (ప్రాథమిక మరియు ప్రాధమికోన్నత ) సాధారణ ఉపాధ్యాయులను మరియు ఇప్పటికే ఉన్న పాఠశాలలకు అదనపు ఉపాధ్యాయులను మంజూరు చేయడం.
  • సివిల్ పనులు  – పాఠశాల భవనాల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం , స్కూల్కాంప్లెక్స్ కోసం మండల వనరుల కేంద్ర భవనాల గదులు, ప్రహరీ గోడలు,మరుగుదొడ్లు, విద్యుదీకరణ మరియు తాగు నీటి సౌకర్యాలు  కల్పించడం.
  • మండల వనరుల కేంద్రాలు మరియు పాఠశాల సముదాయాలు ను బలోపేతం చేయటం.
  • పాఠశాల నిర్వహణ నిధులు, పాఠశాల నిధులు & ఉపాధ్యాయ నిధులను విడుదల చేయటం.
  • ప్రాథమిక మరియు ప్రాధమికోన్నత  పాఠశాలల బోధనాభ్యాసన పరికరాలను మంజూరు చేయట.
  • ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం.
  • బాలికల విద్య, బాల్య విద్య, ఎస్సీలు మరియు ఎస్టీల విద్య, పట్టణ అణగారిన వర్గాల పిల్లల మైనారిటీ పిల్లల కోసం వినూత్న కార్యకలాపాలను అమలు చేయటం.
  • ప్రాథమికోన్నతపాఠశాలలకు కంప్యూటర్ విద్య.
  • పరిశోధన, మూల్యాంకనం, పర్యవేక్షణ.
  • ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు కార్యక్రమాలు.
  • సంఘ నాయకులకు శిక్షణ.
  • బడి మానివేసిన పిల్లలను పాఠశాల ప్రధాన స్రవంతిలోకి తెచ్చేందుకొరకు రెసిడెన్షియల్ / నాన్ రెసిడెన్షియల్  కేంద్రాలను ప్రారంభించడం.
  • ప్రతి సంవత్సరం I నుండి VIII తరగతులలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరికీ 2 జతల ఉచిత సమరూప దుస్తులు అందచేయడం.
  • పట్టణ ప్రాంతాలలో అణగారిన వర్గాల పిల్లలకు ప్రత్యేక నివాస పాఠశాలలను నడపడం.
  • పాఠశాలలు లేని ఆవాస ప్రాంతాలలో గల పిల్లలకు రవాణా ఛార్జీలు అందించడం.

నిర్వహణ నిర్మాణం:

జిల్లాస్థాయిలో, జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రాజెక్టు కు చైర్మన్ గా ఉన్నారు. ప్రాజెక్ట్ వ్యూహాలను అమలు చేయడానికి మరియు  ప్రాజెక్ట్  సమస్యల పై ప్రధానంగా దృష్టి పెట్టడానికి ప్రాజెక్ట్  అధికారులను  నియమిస్తారు.

ప్రాజెక్ట్ అధికారికి  6  విభాగాల అధికారులు సహకరిస్తారు.

  • విద్యా పర్యవేక్షణ అధికారి :  బోధన, విద్యారంగ పరిశోధన, విశ్లేషణ , ఉపాధ్యాయుల సామర్థ్యం పెంపు కొరకు.
  • కమ్యూనిటీ మొబిలైజేషన్ఆఫీసర్ : సంఘ సమీకరణకు సంబంధించిన సమస్యలను చూసుకోవడం.
  • సహిత విద్య సమన్వయ కర్త  : ప్రత్యేక విద్యా అవసరాలున్న పిల్లల సమస్యలను చూసుకుంటారు
  • ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయకర్త : బడి బయట ఉన్న బడిమాని వేసిన  పిల్లలకు సంబంధించిన సమస్యలను చూసుకోవడం
  • బాలికా విద్య అభివృద్ధి అధికారిణి :  బాలికల విద్యకు సంబంధించిన కార్యకలాపాలను చూసేందుకు ఒక మహిళా అధికారిని కూడా నియమించడం జరిగింది. వీరు ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య ఒక వైపు మరియు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు మరొకవైపు పర్యవేక్షించెదరు.
  • సమాచార నిర్వహణ  వ్యవస్థ మరియు ప్రణాళిక అధికారి : కంప్యూటర్అప్లికేషన్లలో పరిజ్ఞానం ఉన్న గజెటెడ్ ఆఫీసర్ హోదా లో   ఉన్న అధికారిని విద్యాశాఖ నుండి  ఎం ఐ యెస్  వింగ్ యొక్క ఎం ఐ యెస్ & ప్లానింగ్  కోఆర్డినేటర్   గా తీసుకొనబడుచున్నది.
  • ఫైనాన్స్&అకౌంట్స్ఆఫీసర్ : ప్రాజెక్ట్ ఖాతా లను క్రమ పద్ధతి లో నిర్వహించడానికి, అసిస్టెంట్ ఆఫీసర్ హోదా లో ఒక అధికారిని ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీసర్ గా  నియమించడం  జరుగుతుంది.
  • ఎగ్జిక్యూటివ్ఇంజనీర్‌ : సివిల్ పనుల  కొరకు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ ను ప్రభుత్వ ఇంజనీరింగ్   విభాగాల నుండి తీసుకొనబడుచున్నది.